ఇటీవలి వర్షాలతో బురదమయమైన అయ్యలూరు ఈద్గా నగర్ హైస్కూల్ ప్రాంగణ సమస్యపై ఎస్‌డిపిఐ నాయకులు హబీబుల్లా, ఉమార్ భాష, అమానుల్లా సమర్పించిన అర్జీకి కలెక్టర్ తక్షణ స్పందన చూపారు. కలెక్టర్ ఆదేశాలతో జెసిపి ద్వారా బురద తొలగించి, గ్రావెల్ వేసి ప్రాంగణాన్ని సరిచేశారు. దీనితో విద్యార్థులు, ఉపాధ్యాయులు సౌకర్యవంతంగా రాకపోకలు సాగిస్తున్నారని, ఈ చొరవకు నాయకులు మంగళవారం కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.