మొంథా తుఫాను కారణంగా వాయిదా పడిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీలు ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్నాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వీ రాజు బుధవారం తెలిపారు. కలెక్టర్ అనుమతితో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. నంద్యాలలో 11, 12 తేదీల్లో వివిధ క్రీడలు, కర్నూలులో 13న స్విమ్మింగ్ పోటీలు జరుగుతాయి.