మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఐ డిమాండ్

నంద్యాల జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రమేష్ బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆత్మకూరు మండలంలోని బాపనంతపురం గ్రామంలో తడిసిన మొక్కజొన్న ధాన్యాన్ని సీపీఐ మరియు రైతు సంఘం నాయకులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్