నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజీలో బుధవారం జరిగిన జిల్లా యువజనోత్సవంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, టిడిపి నాయకుడు ఫిరోజ్ పాల్గొన్నారు. జనవరిలో ఢిల్లీలో జరగబోయే జాతీయ యువజనోత్సవానికి ఇది సన్నాహక కార్యక్రమం. యువతలో నాయకత్వం, సేవాస్ఫూర్తి, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని అధికారులు తెలిపారు.