నంద్యాల ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో జిల్లా పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల కోసం శనివారం ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు, ఏఎస్పీ ఎం. జావళి ఆల్ఫోన్స్ IPS మరియు అదనపు ఎస్పీ యుగంధర్ బాబు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 32 మంది పోలీసులు, 148 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శాంతిరాం ఆసుపత్రి వైద్యులు ఉచిత వైద్య సేవలు అందించారు.