నంద్యాల నూనెపల్లిలోని జ్ఞానాపురం నేషనల్ ఐటీఐ కళాశాలలో బుధవారం ఉద్యోగ మేళా జరగనుంది. జిల్లా ఉపాధి అధికారిణి కల్యాణి తెలిపిన వివరాల ప్రకారం, శ్రీరామ్ చిట్స్, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్, టాటారోయో రేడియేటర్, ఫహర్పుర్, ఇండక్ట్ కంపోసైట్స్ సంస్థలు ఈ మేళాలో పాల్గొంటాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి, 18–30 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. అర్హులైనవారు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఫోటోలతో హాజరుకావాలని సూచించారు.