మంగళవారం గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన నందవరం పుల్లయ్య (55) కేసీ కెనాల్ పిల్ల కాలువలో పడి మృతి చెందాడు. 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన పుల్లయ్య, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఉంటారని ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.