నంద్యాల కలెక్టరేట్‌లో శనివారం జరిగిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించి అవినీతి నిర్మూలనలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎసిబి అధికారులమంటూ వచ్చే ఫేక్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు లేదా ఆన్‌లైన్ చెల్లింపులు చేయరాదని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు.