పాణ్యం మండలంలోని నెరవాడ సమీపంలో శనివారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుండి నెరవాడకు వెళ్తున్న కారు, రోడ్డు దాటుతున్న బర్రెను ఢీకొంది. ఊహించని విధంగా బర్రె ముందుకు రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.