కల్లూరు: ధరణి మైన్స్ రద్దు చేయాలి – రైతుల పంట పొలాలు కాపాడాలి

సోమవారం కర్నూలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ, డీఆర్ఓ చిరంజీవికి వినతిపత్రం సమర్పించారు. ధరణి మైన్స్ కు సరైన అనుమతులు లేకుండానే తవ్వకాలు కొనసాగుతున్నాయని, తక్షణమే వాటిని రద్దు చేసి రైతుల పంట పొలాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్నమడకల గ్రామ సర్పంచ్ కాసిం, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ. కృష్ణ, ఓర్వకల్లు మండలం అధ్యక్షుడు మధుసూదన్ గిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్