ఓర్వకల్లు: ఉపాధి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి

గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి. నాగన్న ఓర్వకల్లు ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో వెంకటరామయ్యకు వినతిపత్రం అందజేస్తూ, నెలల తరబడి బిల్లులు విడుదల చేయకపోవడం దారుణమని విమర్శించారు. వలసలను నివారించేందుకు వెంటనే బిల్లులు విడుదల చేసి, గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్