కర్నూలు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజును ఎస్.జి.ఎఫ్. జిల్లా కార్యదర్శి టి. కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, జిల్లాలోని విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచి, రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్లు పథకాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా స్కూల్ గేమ్స్ కమిటీ కార్యదర్శిని, సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు స్కూల్ గేమ్స్ కమిటీ సభ్యులు, నోబుల్ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మురళి కృష్ణ పాల్గొన్నారు.