పాణ్యం మండలం తమ్మరాజుపల్లి మైనింగ్ రాయల్టీ టోల్ గేట్ వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. రాయల్టీ, ట్రాన్స్పోర్ట్ చార్జీలపై టోల్ గేట్ సిబ్బంది, టిప్పర్ యజమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.