తొగర్చేడు: నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

పాణ్యం మండలం తొగర్చేడు గ్రామంలో మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న, మిరప, పత్తి, మినుము పంట పొలాలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్