కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం 3వ మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 1.20 కోట్ల విలువైన 669 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. సైబర్ ల్యాబ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఈ ఫోన్లను రికవరీ చేశారు. ప్రజలు http://Kurnoolpolice.in/mobiletheft వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.