వెల్దుర్తిలో దొరికిన హ్యాండ్ బ్యాగ్ ను అప్పగించిన టీడీపీ నేత

పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తిలో, టీడీపీ నాయకుడు జ్ఞానేశ్వర్ గౌడ్ మంగళవారం రోడ్డుపై దొరికిన ఒక హ్యాండ్ బ్యాగ్ ను పోలీస్ స్టేషనుకు అప్పగించారు. పోలీసులు బ్యాగ్ ను పరిశీలించగా, అందులో విలువైన వస్తువులు, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఏటీఎం కార్డు ఆధారంగా, ఆ బ్యాగ్ మండలంలోని బోయనపల్లె గ్రామానికి చెందిన కల్లె అన్నమయ్యదానికి చెందినదని పోలీసులు నిర్ధారించారు. జ్ఞానేశ్వర్ గౌడ్ సకాలంలో స్పందించి, బ్యాగ్ ను పోలీసులకు అప్పగించడం ద్వారా బాధితుడికి న్యాయం జరిగేలా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్