వెల్దుర్తిలో దీపం అంటుకుని గాయాలపాలైన ఎనిమిదేళ్ల చిన్నారి రేవతి, కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి కుంకుమ బొట్టు వేస్తుండగా దుస్తులకు దీపం అంటుకుని చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారి కుటుంబానికి వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆసుపత్రిలో అండగా నిలిచి, చిన్నారి మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.