ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి శుక్రవారం 32 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ. 12, 57, 504 విలువైన ఈ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.