మహానందిలో కార్తీక పౌర్ణమి శోభ, వేలాది భక్తుల సందడి

కార్తీక పౌర్ణమి సందర్భంగా మహానంది క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు తరలివచ్చి, ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట, నంది స్తూపం, ముఖద్వారం వద్ద దీపాలు వెలిగించారు. భక్తిశ్రద్ధలతో పూజలు, హారతులతో మహానంది క్షేత్రం కార్తీక దీపాల కాంతిలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో నిండిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్