ఎక్సైజ్ సీఐ రమేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం తరలింపు కేసుల్లో పట్టుబడిన తొమ్మిది వాహనాలను వచ్చే నెల 5వ తేదీన వేలం వేయనున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వేలాల్లో పాల్గొనదలచిన వారు ముందుగా కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వాహనాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.