మంగళవారం ఎమ్మిగనూరు పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న స్లాట్ బుకింగ్ లోని సాంకేతిక సమస్యలు, తేమ శాతం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.