శనివారం ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. బతుకుదెరువు కోసం కూలి పనులకు వెళ్తున్న కపటికి చెందిన కూలీలతో వెళ్తున్న ఆటోను బెంగళూరుకు చెందిన టెంపో వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో చాకలి సరస్వతి (28) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆటోలో ఉన్న మిగతా 14 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.