నందవరం: బైక్ ఢీకొనడంతో మహిళ మృతి

నందవరం మండలం హాలహర్వి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన సంఘటనలో, పొలానికి వెళ్తున్న బోయ పాలజొన్నల లక్ష్మీ (35) అనే మహిళ బైక్ ఢీకొని మృతి చెందారు. ఎమ్మిగనూరు నుంచి బూదురు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను వెనుక నుంచి ఢీకొట్టారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆమె మరణించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్