ఎమ్మిగనూరులో డిఈఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎమ్మిగనూరులో దివ్యాంగుల సాధికారత ఫోరం (డిఈఎఫ్) ఆధ్వర్యంలో గురువారం నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర డిఈఎఫ్ అధ్యక్షుడు బి. సి. నాగరాజు, ఉపాధ్యక్షుడు కమతం వెంకటేష్ పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కులు, రాయితీలు, రిజర్వేషన్లు సాధన కోసం కృషి చేయాలని నిర్ణయించారు. ఎమ్మిగనూరు తాలుకా అధ్యక్షుడిగా శాకం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా డి. ఇస్మాయిల్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్