ఎమ్మిగనూరు మండలంలోని సోగనూరు గ్రామానికి చెందిన నివేదిత అనే బాలిక, అలర్జీ సమస్యల వల్ల చదువు కొనసాగించలేకపోయింది. ఆదోనిలోని కేజీబీవీలో 6వ తరగతిలో చేరినప్పటికీ, అనారోగ్యంతో బాధపడుతూ తరగతులకు హాజరు కాలేకపోయింది. స్థానిక కేజీబీవీలో సీట్లు లేకపోవడంతో ఆమె చదువు ఆగిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి పత్తి చేను పనులకు వెళ్తున్న నివేదిత, అధికారులు స్పందించి స్థానికంగా చదువుకునే అవకాశం కల్పించాలని వేడుకుంటోంది.