AP: రాష్ట్రంలో పంటపొలాలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులను అదుపు చేయడానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక నూతన సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కృత్రిమ మేధస్సు మరియు సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థ, ఏనుగుల కదలికలను గుర్తించి, వాటిని భయపెట్టి పంపించివేస్తుందని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఈ సహజ నివారణ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.