చమత్కారాలు, చలోక్తులతో శాసనసభలో నవ్వులు

AP: అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తన చమత్కారాలు, చలోక్తులతో శాసనసభలో నవ్వులు పూయించారు. జీఎస్టీ సంస్కరణలపై టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మిగతా సభ్యుల కంటే ఎక్కువ సేపు మాట్లాడారు. దాంతో ఆ తర్వాత మాట్లాడేందుకు సిద్ధమైన జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను ఉద్దేశించి.. శ్రావణ్ కుమార్‌ను ఆదర్శంగా తీసుకోవద్దని రఘురామకృష్ణరాజు చెప్పారు. దాంతో సభలో నవ్వులు విరిశాయి.

సంబంధిత పోస్ట్