ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శాసనసభ ఆమోదించిన ఆరు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అమరావతిలో న్యాయవిద్య, పరిశోధన కోసం భారత అంతర్జాతీయ వర్సిటీ ఏర్పాటు బిల్లు-2025 ఆమోదం పొందింది. అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణకు సంబంధించిన ఏపీ ప్రైవేటు వర్సిటీ చట్టం-2025ను కూడా మండలి ఆమోదించింది. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగానికి కొత్త దిశ దొరకనుందని ప్రభుత్వం పేర్కొంది.