AP: గుంటూరు జిల్లా తురకపాలెంలోని నీటిలో పరిమితి స్థాయిలోనే యురేనియం అవశేషాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తాగునీటిలో యురేనియం లీటరుకు 30 మైక్రో గ్రాములు (.03 ఎంజీ/ఎల్)గా ఉంటుందని, తురకపాలెంలో యురేనియం ఆనవాళ్లు 0.001 ఎంజీ/ఎల్ కంటే తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత రెండు రోజులుగా తురకపాలెంలో కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు.