బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో నిన్నటి నుంచి ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకటి లేదా రెండుచోట్ల 50-60 కి.మీ. వేగంతో గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్