యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది: ప్రొఫెసర్ గోపాలరాజు (వీడియో)

AP: ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ప్రొఫెసర్ గోపాలరాజుపై సోమవారం కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. సహచర సిబ్బంది ప్రొఫెసర్‌ను నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రొఫెసర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గోపాలరాజు మాట్లాడుతూ.. ‘ల్యాబ్‌కు హాజరుకావడం లేదని అడిగాను. దాంతో కత్తి తీసి నాపై దాడి చేశాడు. వీపు, చేతిపై కుట్లు పడ్డాయి. అతనిపై యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్