AP: అవసరమైన ట్యాబ్లెట్లను భర్త తీసుకురాలేదని భార్య మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటు చేసుకుంది. కానూరు కల్పనానగర్‌కు చెందిన చిలకల మధులత (38), నాగేశ్వరరెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మధులత ఐదేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతోంది. ట్యాబ్లెట్లు తీసుకురావాలని వాట్సప్‌లో వివరాలు పంపింది. ఆ ట్యాబ్లెట్లు తీసుకురాలేదు. దాంతో మనస్తాపానికి గురై గదిలోకి వెళ్లి ఆమె ఉరేసుకుంది.