భవనం మీద నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

AP: మానసిక అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖలోని గాజువాకలో బుధవారం చోటు చేసుకుంది. వడ్లపూడికి చెందిన ప్రత్యూషకు రాంబిల్లికి చెందిన సతీశ్‌తో వివాహం జరిగింది. కూర్మన్నపాలెంలో అద్దెకు ఉంటున్నారు. ప్రత్యూష గత  కొద్దిరోజులు మానసిక ఒత్తిడి, నిద్రలేమితో బాధపడుతున్నారు. దాంతో ఆమె భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్