AP: కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళం నియోజకవర్గం తండేంవలస గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా, డీఏపీ ఎరువులను పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా యూరియా సరఫరా పంపిణీ చేస్తుదన్నారు.