AP: వైసీపీ తాజాగా సంచలన ట్వీట్ చేసింది. మంత్రి లోకేశ్‌పై 'ఎక్స్' వేదికగా సెటైర్లు వేసింది. ‘4 గంటల్లో 4 వేల మంది అర్జీలు వినగలమా? గంటకు వెయ్యి అర్జీలేంటో తెలుసుకోవడం సాధ్యమేనా? మరీ ఇంత జాకీలా? మహా అయితే గంటకు 40 మందివి వినగలం. అలాంటిది లోకేశ్ 4 గంటల్లో నాలుగు వేల మంది అర్జీలు తీసుకుని, విన్నట్టుగా ఈ ఎలివేషన్లు చూస్తుంటే ‘గచ్చిబౌలి దివాకర్’ గుర్తుకువస్తున్నాడు’ అని ట్వీట్ చేసింది.