నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ సెంటర్‌లో మంత్రి నారా లోకేశ్ మంత్రులతో కలిసి రెండో రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, కందుల దుర్గేశ్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏపీ వాసుల కోసం ఆల్‌రెడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం బయల్దేరింది. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు లోకేశ్ ఆదేశించారు.