అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు!: నారాయ‌ణ

AP: మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి మంత్రి నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుధవారం రాజమండ్రిలో పర్యటించిన మంత్రి, అక్కడి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు నారాయణ వెల్లడించారు. వ‌చ్చే ఏడాది మార్చి నాటికి చాలా మునిసిపాలిటీల పదవీకాలం పూర్తి కానుందని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్