AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో అక్టోబర్ 3న ఉదయం 11 గంటలకు జరగాల్సిన కేబినెట్ భేటీ, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఒక నోట్ విడుదల చేశారు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు సమయం మార్పును గమనించి హాజరు కావాలని సూచించారు.