ప్రకాశం బ్యారేజీకి తప్పిన ముప్పు(వీడియో)

AP: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ఘోర ముప్పు తప్పింది. భారీ వర్షాలు, వరదల వల్ల ఓ భారీ బోటు కృష్ణా నదిలో కొట్టుకు వచ్చింది. అది బ్యారేజీ వైపు వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న APSDMA అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ల సాయంతో బోటును ఇబ్రహీంపట్నం (M) తుమ్మలపాలెం వద్ద గుర్తించి SDRF, గజ ఈతగాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. గతేడాది ప్రకాశం బ్యారేజీ గేటులో బోటు చిక్కుకుపోగా, దాన్ని తీయడానికి అధికారులు 8రోజులు శ్రమించి అతి కష్టం మీద బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్