నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో కలకలం రేగింది. హత్య కుట్రపై సమాచారం ఉన్నా తనకు చెప్పలేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇకపై తనను కలిసే ప్రయత్నం చేయవద్దని వారిని హెచ్చరించినట్టు సమాచారం. ఈ అంశంపై ఎమ్మెల్యే శనివారం ఉదయం 10.30 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.