వైసీపీకి ఎమ్మెల్సీలు రాజీనామా.. ఇంకా పొందని ఆమోదం!

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. జకియా ఖానమ్, జయమంగళ వెంకటరమణ, బల్ల కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్ వైసీపీని వీడారు. వీరంతా మండలి ఛైర్మన్ మోషేర్ రాజుకు తమ రాజీనామా లేఖలు సమర్పించారు. అయితే రాజీనామా చేసి ఒక్కొక్కరికీ నెలలు దాటినా ఇప్పటికీ ఆమోదం లభించలేదు. దాంతో ఎమ్మెల్సీలు హైకోర్టు బాట పట్టినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్