AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం (రేపు) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ (APSDMA) తెలిపింది. అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని సూచించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.