మోదీ పుట్టినరోజు.. ఎంపీ పురంధేశ్వరి రక్తదానం (వీడియో)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి స్వయంగా రక్తదానం చేశారు. బీజేపీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు. రక్తదానం చేయడంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు.. తాను స్వయంగా రక్తదానం చేసినట్టు ఎంపీ పురంధేశ్వరి చెప్పారు.

సంబంధిత పోస్ట్