4 రోజుల్లో ఉపాధి శ్రామికుల అకౌంట్లోకి డబ్బులు!

AP: ఉపాధి హామీ శ్రామికులకు గుడ్ న్యూస్. వేతన బకాయిలు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసింది. నాలుగు రోజుల్లోగా ఉపాధి శ్రామికుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నట్లు సమాచారం. ఈ నిధులతో మే 15 నుంచి ఆగస్టు 15 వరకు చెల్లించాల్సిన బకాయిలు తీరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన చెల్లింపుల కోసం దాదాపు రూ.140 కోట్లు అవసరం అవుతాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్