AP: పంచాయతీరాజ్‌శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదోన్నతులకు ప్రస్తుతం ఉన్న రెండేళ్ల అర్హత కాలాన్ని ఒక సంవత్సరానికి తగ్గించింది. ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా, ఈ శాఖలోని 1,500 మందికి పైగా పంచాయతీ కార్యదర్శులకు ఒకేసారి పదోన్నతి లభించనుంది. వీరిలో డిప్యూటీ ఎంపీడీవోలుగా 660 మందికి పదోన్నతి లభించనుండగా.. మిగిలిన వారు పైగ్రేడ్‌లకు పదోన్నతి పొందుతారు.