ఆళ్లగడ్డ అమ్మవారి శాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శారదా దేవిగా స్వర్ణ దివ్యాభరణాలతో అలంకరించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన ఊరేగింపులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.