గౌరవ శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విడుదల చేసిన GO నెం. 5, తేదీ 14-08-2025 వివాదాలకు దారితీస్తుందని, వెంటనే రద్దు చేయాలని కోరారు. దొమ్మరి కులం పేరును 'దొమ్మర (గిరి బలిజ)'గా మార్చడాన్ని బలిజ కుల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, చారిత్రిక నేపథ్యం ఉన్న బలిజ పేరును వేరే కులానికి అంటగట్టడం సరికాదని ఆయన అన్నారు. ఈ విషయంలో BC సంక్షేమ మంత్రి ఎస్. సవిత, GOను పునఃపరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.