శుక్రవారం, కొలిమిగుండ్ల బెలుం గుహల సమీపంలో నాపరాతి గనుల యజమానులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశమయ్యారు. రాయల్టీ వసూళ్లను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై యజమానులు ప్రస్తావించగా, మంత్రి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వేలాది మంది కార్మికులు ఆధారపడిన ఈ పరిశ్రమకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.