కర్నూలు: క్యూబాపై అమెరికా విధించిన ఆంక్షలు ఎత్తివేయాలి

క్యూబాపై అమెరికా విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని సీఐటీయూ కర్నూలు జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు కోరారు. మంగళవారం కర్నూలులోని గడియారం ఆసుపత్రి వద్ద నిరసన తెలిపి, మాట్లాడారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, క్యూబాపై ఆంక్షలు వెత్తివేయాలని కోరుతూ నినాదాలు చేశారు. క్యూబాపై అమెరికా ఆర్థిక, రాజకీయ ఆంక్షలు విధించడం అన్యాయమన్నారు. ప్రపంచ దేశాలన్నీ క్యూబాకు మద్దతుగా నిలవాలని కోరారు.

సంబంధిత పోస్ట్