నందికొట్కూరులో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. మొంథా తుఫాన్ నష్టం నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు నీట మునిగిపోవడంతో నష్టపోయిన రైతులు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి పంట నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.